¡Sorpréndeme!

YS Jagan YSRCP Formation Day | మెడలో పార్టీ కండువాతో కనిపించిన జగన్..రీజన్ ఏంటంటే | ABP Desam

2025-03-12 2 Dailymotion

జెండా అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్ సార్…? వైఎస్సార్సీపీ పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా  ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహనరెడ్డి  పార్టీ జెండాను ఆవిష్కరించారు.  ఇందులో విశేషం ఏముంది.. పార్టీ ప్రారంభోత్సవం నాడు అధ్యక్షుడు చేసే పనే కదా అనుకోవచ్చు. అలా అయితే ఇప్పుడు మాట్లాడుకోవలసిన పనేముంది…?2011, మార్చి 12న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనగా వైఎస్సార్సీపీని ప్రారంభించారు. అంటే ఇప్పటికి 14 వార్షికోత్సవాలు జరిగాయి. అయితే వీటిలో ఇప్పటి వరకూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు అయిన జగన్ మోహనరెడ్డి ఎన్నిసార్లు జెండా ఎగరేశారో తెలుసా… రెండు లేదా మూడుసార్లు మాత్రమే…